నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి.
తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు.