adharva
-
'అథర్వ' నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్
యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ అథర్వ.మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చితత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది. కాగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, రొమాంటిక్, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. -
నా దృష్టిలో అన్నీ రీమేక్ సినిమాలే
‘‘దాగుడుమూతలు’ అనే సినిమా తీయాలని కొన్ని నెలలు ప్రయత్నించాను. కుదర్లేదు. అప్పుడు రజనీకాంత్‌గారితో కార్తీక్ సుబ్బరాజ్ చేస్తున్న ‘పేటా’ ఫస్ట్ లుక్ వచ్చింది. అంతకుముందు కార్తీక్ తీసిన ‘జిగర్తండా’ను చూశాను. ‘పేటా’ లుక్ వచ్చాక మళ్లీ చూశాను. ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అనిపించింది. అలా ‘వాల్మీకి’ సినిమా స్టార్ట్ అయింది’’ అన్నారు దర్శకుడు హరీశ్ శంకర్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంగా హరీశ్ శంకర్ చెప్పిన విశేషాలు. ► ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక పాత్ర కోసం వరుణ్ తేజ్‌ని కలిశాను. ‘నాతో ఎందుకు చేయాలనుకుంటున్నారు?’ అని అడిగాడు. ‘ఫిదా, తొలి ప్రేమ’ వంటి సినిమాలు చేస్తున్నావు కదా. ఈ పాత్రకు బావుంటావనిపించింది’ అన్నాను. ‘నేను మీ స్టయిల్ సినిమా చేయాలనుకుంటున్నాను. అలాంటి సినిమా చేద్దాం’ అన్నాడు వరుణ్. ఆ తర్వాత ‘జిగర్తండా’ రీమేక్ ఉంది, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనగానే వరుణ్ ఆసక్తి చూపించాడు. ఈ సినిమాను చాలా డెడికేషన్‌తో చేశాడు వరుణ్. సెట్లో సీన్ పేపర్ పట్టుకొని చిన్నపిల్లాడు నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ ఉండేవాడు. ► ఎనిమిదేళ్ల తర్వాత ఓ రీమేక్ సినిమా చేశాను. నా దృష్టిలో ఏ సినిమా అయినా రీమేక్ కిందే లెక్క. ఒక సినిమా చేయడానికి ఒక పుస్తకమో, ఓ వ్యక్తో ఏదైనా సంఘటనో ప్రేరణ అయినప్పుడు మరో సినిమా ఎందుకు కాకూడదు? నాకు రీమేక్ అయినా సొంత కథతో సినిమా అయినా ఒకటే. ► హిందీ ‘దబాంగ్’ని తెలుగు (‘గబ్బర్ సింగ్)లో రీమేక్ చేసేటప్పుడు చాలా మార్పులు చేశాను. ఆ ధైర్యంతోనే టైటిల్ కార్డ్‌లో ‘మాటలు–మార్పులు–దర్శకత్వం’ అని వేసుకున్నాను. కానీ ‘వాల్మీకి’ సినిమాలో ఎక్కువ మార్పులు చేయలేదు. కొన్ని షాట్స్ అలానే తీశాం. అందుకని ‘మార్పులు’ అని ప్రత్యేకంగా వేసుకోలేదు. ఈ సినిమాలో సుకుమార్‌గారు, నితిన్, బ్రహ్మానందంగారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ► ఒక మనిషిలోని అత్యున్నతమైన మార్పుకు నిదర్శనం వాల్మీకి. ఆ టైటిల్ అయితే సినిమాకు బావుంటుందని పెట్టాం. టైటిల్ మీద చిన్న ఇష్యూ నడుస్తోంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ► పూజా హెగ్డే పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్‌లో వస్తుంది. తన పాత్ర సర్ప్రైజ్. వరుణ్–పూజా మీద ‘దేవత’ సినిమాలో ‘వెల్లువచ్చి గోదారమ్మ..’ పాట రీమిక్స్ చేశాం. పాత పాటలానే షూట్ చేశాం. ► అథర్వ మురళి పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నాం. దర్శకుడవ్వాలనే కసితో ఉండే కుర్రాడి పాత్ర చేయాలంటే ఏ ఇమేజ్ లేని నటుడైతే బెస్ట్ అని అతణ్ణి తీసుకున్నాను. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంటగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ల 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో తొలి సినిమా నేనే చేయడం ఆనందంగా ఉంది. ► ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నాను. కేవలం డబ్బు కోసం కాకుండా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. నా మిత్రులు కృష్ణ, మహేశ్ కోనేరులతో కలసి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ► చలంగారి ‘మైదానం’, యండమూరిగారి ‘ప్రేమ’ నవలలను సినిమాగా తీయాలనుంటుంది. కుదరదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గమనించి, అందులో మన శైలికి ఏది మ్యాచ్ అవుతుందో అలాంటి సినిమాలు తీయలి. ఓ సినిమాను ఎక్కువ మంది చూస్తే అది కమర్షియల్ సినిమా కిందే లెక్క. మనం ఈ సినిమా తీయాలి అనుకుని సినిమా తీయలేం. సినిమానే దర్శకుడిని ఎంచుకుంటుంది కానీ దర్శకుడు సినిమాని ఎంచుకోలేడు అని నేను నమ్ముతాను. నాకు త్వరత్వరగా సినిమాలు తీయాలని ఉన్నా అనుకోకుండా గ్యాప్ వస్తుంది. ► ప్రస్తుతం రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఏది ముందు మొదలవుతుందో తెలియదు. అందరూ బలంగా కోరుకుంటే పవన్ కల్యాణ్‌గారితో సినిమా ఉండొచ్చు. ఎన్టీఆర్‌గారితో చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేదు. ఆయనతో ఓ సినిమా తీసి రుణం తీర్చుకోవాలి. ► నాకు, ‘దిల్’ రాజుగారికి చిన్న చిన్న క్రియేటివ్ డిఫరెన్సెన్స్ ఉన్నాయి. అది ఏ నిర్మాత – దర్శకుడికైనా ఉండేవే. ‘దాగుడుమూతలు’ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రమే కావాలని నేను, స్టార్స్‌తో తీద్దాం అని ఆయన. క్రియేటివ్‌గా చిన్న చిన్న డిఫరెన్స్ తప్పితే ఆయనకు, నాకు మంచి అనుబంధం ఉంది. ► వరుణ్ హీరో అవ్వకముందు గడ్డం పెంచుకొని ఫొటోషూట్ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్‌ను నాగబాబుగారు నాకు చూపించారు. ఆ లుక్ నా మనసులో ఉండిపోయింది. వరుణ్ మేకోవర్కి కారణం నాగబాబుగారే. ఈ సినిమా కోసం ఆ లుక్ కావాలంటే వరుణ్ మౌల్డ్ అయ్యాడు. ఇందులో తన నటవిజృంభణ చూస్తారు. వరుణ్, నేను గర్వంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. -
‘వాల్మీకిని రిలీజ్ కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికెట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్ స్టర్‌తో పోల్చడం వల్ల ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దాంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు. తక్షణమే ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. లేకపోతే బోయ కమ్మూనిటీ అంతా ఒక్కటి అవుతుందని.. అందుకు నిర్మాతలు, డైరెక్టర్, నటులు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు. టైటిల్ మార్చకుంటే రిలీజ్ కానివ్వం: గోపి బోయ మా జాతికి గురువు అయిన వాల్మీకిని ఈ సినిమా ద్వారా రాబోయే తరాలకు గ్యాంగ్‌స్టర్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి బోయ ఆరోపించారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు రాం అచంట, గోపి అచంటలను కలిసి టైటిల్ మార్చమని కోరామన్నారు. అంతేకాక హీరో వరుణ్ని కూడా కలిసామని కానీ వారు స్పందించలేదని తెలిపారు. టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు. (చదవండి: నాతోటి పందాలు వేస్తే సస్తరు) -
నాతోటి పందాలు వేస్తే సస్తరు
‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు, మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా, గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేం టు సేం, గద్దలకొండ గణేశ్ అంటే గజ గజ వణకాలి’ అంటూ ‘వాల్మీకి’ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కి ఇది తెలుగు రీమేక్. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘వాల్మీకి’ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’ సినిమాని నేను ఏ దృష్టితో చూశానో వరుణ్ కూడా అదే కోణంలో చూసి నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి సాఫ్ట్ పాత్రలు చేసిన వరుణ్ ‘వాల్మీకి’ లో పక్కా మాస్ పాత్ర చేశారు. ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. హిందీ ‘దబాంగ్’ సినిమాని ‘గబ్బర్‌సింగ్’గా రీమేక్ చేసినప్పుడు చాలా మార్పులు చేశాను.. ‘వాల్మీకి’లో మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మాత్రమే మార్పులు చేశాం. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి బోయ సంఘంవారు, వాల్మీకి అభిమానులు గర్వపడతారు’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర అవసరమా? అని చాలామంది అన్నారు. కానీ హరీష్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి.. ‘జిగర్తాండ’ అలాంటి చిత్రమే. చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్... వంటి వారు గతంలో చేసిన సినిమాలు చూస్తే రాముడు మంచి బాలుడు అనేలా హీరోలా పాత్రలు ఉండేవి. ఈ మధ్య హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. నేను కూడా హీరోలాంటి పాత్రలు చేశా. కానీ, వైవిధ్యంగా ఉండేలా ప్రయోగాత్మకంగా ఏదైనా ఓ పాత్ర చేయాలనుకున్నా. అలాంటి పాత్రే ఇది. ఈ పాత్ర నాకే కొత్తగా అనిపించింది. సినిమాలో మంచోడి కంటే చెడ్డోడి పాత్ర బాగుంటుంది (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటగార్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో ‘జర జర...’ పాటకి చాలా మంచి స్పందన వస్తోంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అన్నారు. నిర్మాత రామ్ ఆచంట పాల్గొన్నారు. -
తమిళంలో నిన్ను కోరి
మంచి ప్రేక్షకాదరణ దక్కిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సాధారణమే. ఆ జాబితాలోకి తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రం కూడా చేరిందట. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ముఖ్య తారాగణంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం తెలుగులో మంచి హిట్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోందని సమచారం. అధర్వ, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఇటీవల కన్నన్ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్ అని టాక్. మరి.. తెలుగులో ఆది పినిశెట్టి చేసిన పాత్రను తమిళంలోఎవరు? చేస్తారో చూడాలి. -
కామెడీ టు సీరియస్
‘పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్తు తెలుసు’ అంటూ వెంకటేశ్‌తో కలసి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) లో కామెడీ పండించారు వరుణ్ తేజ్. ఇప్పుడు ‘వాల్మీకి’ సినిమా కోసం సీరియస్ మూడ్‌లోకి మారిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం స్టార్ట్ అయింది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కి ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్. -
అన్నింటికీ ధనమ్ మూలమ్
అధర్వ, మిస్తీ చక్రవర్తి జంటగా దర్శకుడు బద్రి వెంకటేశ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సెమ్మ బోథ ఆగాదే’. ఈ చిత్రాన్ని ‘ధనమ్ మూలమ్’ టైటిల్‌తో నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు ఈ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘కిక్కు ఎక్కిపోయెరా’ అనేది క్యాప్షన్. ‘‘ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజశేఖర్. ‘‘ఇదో క్రైమ్ థ్రిల్లర్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. తమిళంలో లాగానే తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు సహ నిర్మాత జె.వి. రామారావు. ఈ చిత్రానికి సమర్పణ: వీరబ్రహ్మాచారి అన్నభీమోజు, నిర్మాణం: గ్రేహాక్ మీడియా. -
అంజలి సాహసం
నయనతార లీడ్ రోల్లో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ ‘అంజలి విక్రమాదిత్య’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో ఘన విజయం సాధించింది. నయనతార, అధర్వ, రాశీఖన్నాల నటన హైలైట్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశారు. ఇందులో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరవనున్నారు. అంజలి చేసే సాహసాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
30న తెరపైకి ఇమైకా నొడిగళ్
తమిళసినిమా: అధర్వ, నయనతార, విజయ్‌సేతుపతి, రాశీఖన్నా, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇమైకా నొడిగళ్ భారీ అంచనాల మధ్య ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే. జయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డిమాంటీ కాలనీ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. హిప్హాప్ తమిళా సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ బుధవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సీఏ.జయకుమార్ మాట్లాడుతూ ఇది మల్టీస్టారర్ చిత్రం అని, రెండేళ్ల కఠిన శ్రమ, అవమానాలను దాటి ఈ నెల 30వ తేదీన విడుదల కానుందన్నారు. చిత్రంపై దర్శకుడి నమ్మకంతో విడుదలకు ఐదు రోజుల ముందు పత్రికల వారికి ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హిందీ నటుడు అనురాగ్ కశ్యప్ నటన యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందన్నారు. అదే విధంగా అధర్వ, రాశీఖన్నాల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెప్పారు. ఇక విజయ్‌సేతుపతి, నయనతారల సన్నివేశాలు అందరిని కంటతడి పెట్టిస్తాయని అన్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తాము ఎలాంటి కాంప్రమైజ్ కాలేదన్నారు. పోరాట దృశ్యాలకు అవసరమైన వాటిని నిర్మాత నుంచి ఎలా అడిగి తీసుకోవాలో ఫైట్ మాస్టర్ స్టన్ శివకు బాగా తెలుసన్నారు. హిప్హాప్ తమిళా నేపథ్య సంగీతంతో కలిపి చిత్రాన్ని చూడడానికి తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నిర్మాత అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ ఇమైకా నొడిగళ్ రోలర్ కోస్టర్ రైడ్ కంటే కష్టమైనదని, ఏమైనా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చేయాలని తాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు భావించామని అన్నారు. చాలా శ్రమ తరువాత నిర్మాత జయ్‌కుమార్ ఈ చిత్రంలోకి వచ్చారని తెలిపారు.ఆయన కథను నమ్మి ఖర్చు పెట్టారని తెలిపారు. నయనతార, అనురాగ్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు ఆర్డీ.రాజశేఖర్ అంటూ తన ఫేవరేట్స్ లిస్ట్‌లో ఉన్న వారందరూ ఈ చిత్రంలో పనిచేయడం పెద్ద సర్ప్రైజ్ అని అన్నారు. ఈ చిత్ర ఆల్బమ్ తనకు చాలా నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో పోరాట దృశ్యాల్లో నటించడం మరచిపోలేని అనుభవం అని అధర్వ పేర్కొన్నారు. రాశీఖన్నా, సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పాల్గొన్నారు. -
సెంచరీ కోసం...
సెంచరీ కోసం హన్సిక చాలా కష్టపడుతున్నారు. హీరోయిన్గా ఇంకా హాఫ్ సెంచరీ కూడా కంప్లీట చేయలేదు. అప్పుడే వందకి టార్గెట్ పెట్టారేంటి అనుకుంటున్నారా? ఈ 100 సినిమాల లెక్కకు సంబంధించినది కాదు. పబ్లిక్కు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పోలీసులకు ఫోన్ చేసేది 100 నంబర్‌కే కదా. ఆ నంబర్ గురించి చెబుతున్నాం. విషయం ఏంటంటే.. అధర్వ, హన్సిక జంటగా సామ్ ఆంటోన్ దర్శకత్వంలో ‘100’ పేరుతో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు అధర్వ. అందుకే టైటిల్ ‘100’ అని పెట్టి ఉంటారని ఊహించవచ్చు. ఇందులో హన్సికది రెగ్యులర్ గ్లామరస్ క్యారెక్టర్ కాదట. పెర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉంది. అందుకే ఇష్టంగా కష్టపడి చేస్తున్నారట. ‘‘ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. సినిమా పూర్తయింది. ఈ సినిమా జర్నీ మంచి ఎక్స్పీరియన్స్. యాక్షన్ ప్యాక్డ్గా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హన్సిక కెన్యాలో ఉన్నారు. బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్ కోసమే అని కొందరు, హాలీడే అని మరికొందరు అంటున్నారు. -
100 ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: 100 అనేది సంఖ్య మాత్రమే కాదు. అది అత్యవసర పోలీస్‌స్టేషన్ నంబర్ కూడా. అలాంటి నంబరునే టైటిల్‌గా సినిమా తెరకెక్కుతోందంటే అది కచ్చితంగా పోలీస్ ఇతి వృత్తంతో కూడిన చిత్రం అని అర్థం అయిపోతుంది. ఇప్పటి వరకూ తమిళ తెరపై చాలా మంది ప్రముఖ హీరోలు పోలీస్అధికారిగా నటించి అలరించారు. తాజాగా పోలీస్అధికారిగా మెప్పించడానికి నేనూ రెడీ అంటున్నారు యువ నటుడు అధర్వ. చిత్రాల ఎంపికలో ఆచితుచి అడుగేస్తున్న ఈయన ఇటీవల నిర్మాతగా కూడా మారి సెమ బోద ఆగాద అనే చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీనితో పాటు అధర్వ బూమరాంగ్, 100 అనే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. 100 చిత్రంలో ఆయకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. ఈ కేజ్రీ కాంబినేషన్ చిత్రాన్ని ఆరా సినిమా పతాకంపై కావ్య వేణుగోపాలన్ నిర్మిస్తున్నారు. దీనికి డార్లింగ్ చిత్రం ఫేమ్ శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహిస్తున్నారు. 100 చిత్రంలో అధర్వ పోలీస్అధికారిగా తొలిసారిగా చాలా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, క్రిష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శ్రువారం విడుదల చేశారు.ఈ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
రాశీఖన్నా లక్కీచాన్స్
తమళసినిమా: రాశిని తన పేరులోనే ఇముడ్చుకున్న నటి రాశీఖన్నా. టాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లో తన సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఆల్రెడీ బహుభాషా కథానాయకి అనిపించుకున్న రాశీ కోలీవుడ్‌లో ఇమైకా నోడిగళ్ చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆ చిత్రం విడుదలకు ముందే మరో లక్కీచాన్స్‌ను కొట్టేసిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరున్న స్టార్ నటుడు జయంరవితో రొమాన్స్ చేసే అవకాశం రాశీఖన్నాను వరించింది. ఈయనతో జత కట్టిన హీరోయిన్లందరూ కోలీవుడ్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నది గమన్హారం. జయంరవి ప్రస్తుతం శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్ నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తదుపరి జయంరవి సుదర్.సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.ఈ చిత్రం 2018 ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్ దర్శకత్వంలో హోమ్ మూవీస్ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. ఈ నెలలోనే చిత్ర షూటిం గ్ పారంభం కానుందని, ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
'సంగీత దర్శకుడికి రెమ్యూనరేషన్ ఇవ్వకండి'
పన్ను రాయితీల కోసం చిత్రాలకు తమిళ పేర్లు పెట్టకూడదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి అన్నారు. నటు డు అధర్వ, రెజీనా జంటగా నటించిన చిత్రం జెమిగణేశనుమ్ సురుళీ రాజానుమ్. అమ్మా క్రిమేషన్స్ పతాకంపై టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను ఒడమ్ ఇళవరసు నిర్వహిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవనర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడూతూ ఈ చిత్రానికి జెమినీగణేశనుమ్ సురళీరాజానుమ్ అనే పేరును నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. అయితే దీన్ని ఇంగ్లిష్‌లో జీజీఎస్ఆర్ అని పిలవడం సరికాదన్నారు. తమిళ భాషపై ప్రేమతో చిత్రాలకు తమిళంలో పేర్లు నిర్ణయించాలి గానీ, పన్ను రాయితీల కోసం పేర్లు పెట్టకూడదన్నారు. ఆ చిత్రానికి సంగీతాన్ని అందించిన డి.ఇమాన్‌కు నిర్మాత టి.శివ పారితోషికం చెల్లించకూడదన్నారు. ఒక వేళ ఇచ్చి ఉంటే తిరిగి తీసుకోవాలని అన్నారు. ఆయన ఈ చిత్రంలో నలుగురు అమ్మాయిలతో డి.ఇమాన్‌ను చూస్తుంటే తనకే అసూయ కలుగుతోందన్నా రు. తనకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించింది ఈ చిత్ర నిర్మాత టి.శివనేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిర్మాత ఇబ్రహిం రావుదర్కు పరిచయం చేసి అవకాశం కల్పించారని, మధ్యలో వేరే వారికి పోతే మళ్లీ శివనే ఇబ్రహిం రావుదర్కు నటులు అధర్వ, రెజీనా పాల్గొన్నారు. చెప్పి తనకు ఇప్పించారని తెలిపారు. -
అధర్వతో చెన్నై చిన్నది?
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా మారింది యువనటుడు అధర్వ టైమ్. ఇటీవలే నిర్మాతగా అవతారమెత్తి చమ్మ బోద ఆగాదు చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరో పక్క ఇమైకా నోడిగళ్ చిత్రంలో అగ్రనాయకి నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇందులో నయనతార ఆయనకు అక్కగా సెంటరిక్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నయనతార నెచ్చెలి, వృత్తిపరంగా పోటీ నటి అయిన చెన్నై చిన్నది త్రిషతో రొమాన్స్ చేయడానికి అధర్వ సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. సంచలన దర్శకుడు బాలా శిషు్యడు విటో వివేక్ మోగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఈయన అధర్వ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధర్వతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని అధర్వ స్పష్టం చేశారు. దర్శకుడు విటో వివేక్ చెప్పిన కథ ఆసక్తికరంగా ఉందన్నారు.అయితే తాను అందులో నటించే విషయం చర్చల దశలోనే ఉందన్నారు. ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమేనట. ఇందులో నాయకిగా నటించడానికి నటి త్రిషను ఎంపిక చేసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటించే నటీనటుల వివరాల గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు దర్శకుడు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. -
నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి. తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ
యువ దర్శకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారి తమ శిష్యులకు అవకాశాలను కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ కోవలో కబాలి దర్శకుడు పా.రంజిత్ కూడా చేరనున్నారన్నది తాజా సమాచారం. మూడే మూడు చిత్రాలతో ప్రముఖ దర్శకుల పట్టికలో చోటు సంసాదించుకున్న పా.రంజిత్ తాజాగా మరోసారి సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రానికి దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా మరో పక్క నీలం ప్రొడక్షన్స పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి వరుసగా చిత్రాలను నిర్మించ తలపెట్టారు. ముందుగా యువ నటుడు అధర్వ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అరుునట్లు తెలిసింది. ఇందుకు ఆయన ఓల్ట్ పీరియడ్ కథను తయారు చేశారట. 1973లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా సిద్ధం చేసుకున్న ఈ చిత్రానికి తన శిష్యుడొకరిని దర్శకుడిగా పరిచయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో నయనతారతో కలిసి నటిస్తున్న అధర్వ తదుపరి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే పా.రంజిత్ చిత్రంలో నటించే అవకాశం ఉంటుందన్నది గమనార్హం. -
విలన్‌గా స్టార్ డైరెక్టర్
రొమాంటిక్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా ఆకట్టుకుంటున్న గౌతమ్, త్వరలో నటుడిగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో అతిథి పాత్రలతో అలరించిన గౌతమ్ మీనన్, త్వరలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసేందుకు అంగీకరించాడు. తమిళ దర్శకుడు జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం గౌతమ్ మీనన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
క్రీడా నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా
ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ప్రేమమ్ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈట్టి సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమిళ్లో అధర్వ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి అరసు దర్శకుడు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రవి అరసు తెలుగు వర్షన్‌కు కూడా దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఓ అరుదైన వ్యాధితో బాదపడుతున్న కుర్రాడు తన బలహీనతను అధిగమించి అథ్లెట్‌గా ఎదగడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఏడాది క్రితమే ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించినా.. వర్క్ అవుట్ కాలేదు. తాజాగా నాగచైతన్య హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మరో రీమేక్‌లో చైతూ
ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ప్రేమమ్ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈట్టి సినిమాను నాగ చైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమిళ్లో అధర్వ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి అరసు దర్శకుడు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రవి అరసు తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఓ అరుదైన వ్యాధితో బాదపడుతున్న కుర్రాడు తన బలహీనతను అధిగమించి అథ్లెట్‌గా ఎదగడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఏడాది క్రితమే ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించినా.. వర్క్ అవుట్ కాలేదు. తాజాగా నాగచైతన్య హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సమంత అధర్వతో జోడీ కడుతుందా?
మరపురాని విజయాలు జీవితంలో మెలురాళ్లుగా నిలిచిపోతాయన్నది ఎంత సత్యమో తొలి చిత్రం అందులో నటించిన సహ నటుడు గానీ, నటి గానీవారికి జీవితాంతం గుర్తుండి పోతారన్నది అంత నిజం. అలాగే నేటి కొత్త తారలు రేపటి క్రేజీ బ్యూటీలుగానూ మాపటికి మాజీ భామలుగానూ అవడం సహజం. ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం నటిగా సమంత స్థాయి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్, తెలుగు ద్విభాషల్లోనూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ చెన్నై చందం నటిస్తున్నవన్నీ టాప్ హీరోల చిత్రాలే అన్నది గమనార్హం. అయితే సమంత నాయకిగా నటించిన తొలి చిత్రం బానాకాత్తాడి. ఇందులో కథానాయకుడు అధర్వ. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించిన ఆ చిత్రానికి బద్రి వెంకట్ దర్శకుడు. 2010లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడిందన్నది వాస్తవం. కాగా సమంత కెరీర్‌కు మాత్రం బానాకాత్తాడి బాగానే హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ భామ ఘన విజయాన్ని చవిచూసింది మాత్రం తెలుగు చిత్రం ఏమాయ చేసావే చిత్రంతోనే. ఏదేమైనా ప్రస్తుతం సమంత ప్రముఖ కథానాయకి అంతస్థును అధిష్టించిన నటి. ఐదేళ్లలోనే 25 చిత్రాలో నటించేశారు. అలాంటి నాయకి ఇప్పుడు తన తొలి చిత్ర కథానాయకుడితో నటిస్తారా?అన్నదే చిత్రపరిశ్రమలో ఆసక్తిగా మారిన అంశం. విషయం ఏమిటంటే అధర్వకు చిన్న నిరీక్షణ తరువాత ఈటీ చిత్రంతో మంచి విజయం వరించింది.దీంతో చాలా ఉత్సాహంగా ఉన్న ఈ యువ హీరో స్వంతంగా చిత్ర నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. కిక్కాస్ ఎంటర్టెయిన్మెంట్ అనే బ్యానర్‌ను కూడా నమోదు చేసుకున్నారు. దీనికి తన తొలి చిత్ర దర్శకుడు బద్రివెంకట్నే ఎంచుకున్నారు. అదే విధంగా తొలి చిత్ర నాయకినే నటింపజేయాలని ఆశిస్తున్నట్లు, అందుకు దర్శకుడు, నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టాప్ హీరోల చిత్రాలతో యమ బిజీగా ఉన్న సమంత తన తొలి చిత్ర కథానాయకుడితో నటించడానికి సుముఖత వ్యక్తం చేస్తారా?లేదా అన్నది ఆసక్తిగా మారింది.