'సంగీత దర్శకుడికి రెమ్యూనరేషన్ ఇవ్వకండి'
పన్ను రాయితీల కోసం చిత్రాలకు తమిళ పేర్లు పెట్టకూడదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి అన్నారు. నటు డు అధర్వ, రెజీనా జంటగా నటించిన చిత్రం జెమిగణేశనుమ్ సురుళీ రాజానుమ్. అమ్మా క్రిమేషన్స్ పతాకంపై టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను ఒడమ్ ఇళవరసు నిర్వహిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్లోని కలైవనర్ ఆవరణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి మాట్లాడూతూ ఈ చిత్రానికి జెమినీగణేశనుమ్ సురళీరాజానుమ్ అనే పేరును నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. అయితే దీన్ని ఇంగ్లిష్‌లో జీజీఎస్‌ఆర్ అని పిలవడం సరికాదన్నారు. తమిళ భాషపై ప్రేమతో చిత్రాలకు తమిళంలో పేర్లు నిర్ణయించాలి గానీ, పన్ను రాయితీల కోసం పేర్లు పెట్టకూడదన్నారు.
ఆ చిత్రానికి సంగీతాన్ని అందించిన డి.ఇమాన్కు నిర్మాత టి.శివ పారితోషికం చెల్లించకూడదన్నారు. ఒక వేళ ఇచ్చి ఉంటే తిరిగి తీసుకోవాలని అన్నారు. ఆయన ఈ చిత్రంలో నలుగురు అమ్మాయిలతో డి.ఇమాన్ను చూస్తుంటే తనకే అసూయ కలుగుతోందన్నా రు. తనకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించింది ఈ చిత్ర నిర్మాత టి.శివనేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిర్మాత ఇబ్రహిం రావుదర్‌కు పరిచయం చేసి అవకాశం కల్పించారని, మధ్యలో వేరే వారికి పోతే మళ్లీ శివనే ఇబ్రహిం రావుదర్‌కు నటులు అధర్వ, రెజీనా పాల్గొన్నారు. చెప్పి తనకు ఇప్పించారని తెలిపారు.