MM Keeravani: డ్యాన్స్‌ చేశాం | MM Keeravani Speech At Love Me Audio Launch Event | Sakshi
Sakshi News home page

MM Keeravani: డ్యాన్స్‌ చేశాం

Published Thu, Apr 11 2024 12:50 AM | Last Updated on Thu, Apr 11 2024 12:50 AM

MM Keeravani Speech At Love Me Audio Launch Event - Sakshi

– ఎంఎం కీరవాణి

‘‘లవ్‌ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్‌ సాంగ్‌ రాశారు చంద్రబోస్‌గారు.  ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్‌ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్‌ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ మీ’.

శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్‌ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్‌ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ చూస్తుంటే సక్సెస్‌ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్‌ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్‌. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్‌ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్‌ పీసీ శ్రీరామ్‌ తదితరులు ΄ాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement