ఓటీటీకి బేబీ హీరోయిన్‌ మూవీ.. అప్‌డేట్‌ వచ్చేసింది! | Actress Vaishnavi Chaitanya Love Me If You Dare Movie OTT Release Confirmed, Streaming Platform Inside | Sakshi
Sakshi News home page

Love Me Movie In OTT: ఓటీటీకి టాలీవుడ్‌ హారర్‌ రొమాంటిక్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Jun 12 2024 9:23 PM | Last Updated on Thu, Jun 13 2024 12:14 PM

Tollywood Actress Vaishnavi Chaitanya Latest Movie Ott Update

యంగ్ హీరో ఆశిష్, బేబి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'లవ్ మీ'. ఇఫ్‌ యూ డేర్ అనేది సబ్ టైటిల్‌. మే 25న ఈ మూవీ థియేటర్ల రిలీజై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హారర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్‍రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయంపై మేకర్స్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇ‍చ్చారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా..  దెయ్యాన్ని  ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement