100 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల | Hansika 100 Movie Poster Release | Sakshi
Sakshi News home page

100 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Published Sat, Jun 2 2018 9:16 AM | Last Updated on Sat, Jun 2 2018 9:16 AM

Hansika 100 Movie Poster Release - Sakshi

తమిళసినిమా: 100 అనేది సంఖ్య మాత్రమే కాదు. అది అత్యవసర పోలీస్‌స్టేషన్‌ నంబర్‌ కూడా. అలాంటి నంబరునే టైటిల్‌గా సినిమా తెరకెక్కుతోందంటే అది కచ్చితంగా పోలీస్‌ ఇతి వృత్తంతో కూడిన చిత్రం అని అర్థం అయిపోతుంది. ఇప్పటి వరకూ తమిళ తెరపై చాలా మంది ప్రముఖ హీరోలు పోలీస్‌అధికారిగా నటించి అలరించారు. తాజాగా పోలీస్‌అధికారిగా మెప్పించడానికి నేనూ రెడీ అంటున్నారు యువ నటుడు అధర్వ. చిత్రాల ఎంపికలో ఆచితుచి అడుగేస్తున్న ఈయన ఇటీవల నిర్మాతగా కూడా మారి సెమ బోద ఆగాద అనే చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీనితో పాటు అధర్వ బూమరాంగ్, 100 అనే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. 100 చిత్రంలో ఆయకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. ఈ కేజ్రీ కాంబినేషన్‌ చిత్రాన్ని ఆరా సినిమా పతాకంపై కావ్య వేణుగోపాలన్‌ నిర్మిస్తున్నారు. దీనికి డార్లింగ్‌ చిత్రం ఫేమ్‌ శ్యామ్‌ ఆంటన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 100 చిత్రంలో అధర్వ పోలీస్‌అధికారిగా తొలిసారిగా చాలా పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, క్రిష్ణన్‌ వసంత్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శ్రువారం విడుదల చేశారు.ఈ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement