![Telugu Girl Hansika Nasanally Wins National All-American Miss Title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/5/11.jpg.webp?itok=ZxNbzlWU)
బంజారాహిల్స్: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో నగరానికి చెందిన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి సత్తాచాటి విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. హన్సిక రెండు సంవత్సరాలుగా యూఎస్‌ఏ నేషనల్ లెవెల్ యా్రక్టెస్ పోటీల్లో సైతం విజేతగా నిలిచారు.
అదేవిధంగా అకడమిక్ అచీవ్‌మెంట్ విన్నర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ నాలుగుసార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ.మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్‌ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తాచాటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment