క్రీడా నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా | Naga Chaitanya to act in the Telugu remake of Eetti | Sakshi
Sakshi News home page

క్రీడా నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా

Published Thu, Jun 30 2016 9:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

క్రీడా నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా

క్రీడా నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా

ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్గా రూపొందుతున్న ప్రేమమ్ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈట్టి సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమిళ్లో అధర్వ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి అరసు దర్శకుడు.

తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రవి అరసు తెలుగు వర్షన్కు కూడా దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఓ అరుదైన వ్యాధితో బాదపడుతున్న కుర్రాడు తన బలహీనతను అధిగమించి అథ్లెట్గా ఎదగడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఏడాది క్రితమే ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించినా.. వర్క్ అవుట్ కాలేదు. తాజాగా నాగచైతన్య హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement