విలన్గా స్టార్ డైరెక్టర్ | Gautham Menon to play villain | Sakshi
Sakshi News home page

విలన్గా స్టార్ డైరెక్టర్

Published Thu, Sep 15 2016 6:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

విలన్గా స్టార్ డైరెక్టర్

విలన్గా స్టార్ డైరెక్టర్

రొమాంటిక్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరున్న సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా ఆకట్టుకుంటున్న గౌతమ్, త్వరలో నటుడిగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో అతిథి పాత్రలతో అలరించిన గౌతమ్ మీనన్, త్వరలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసేందుకు అంగీకరించాడు.

తమిళ దర్శకుడు జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం గౌతమ్ మీనన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ మెయిన్ విలన్గా నటిస్తున్నాడు. ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement