ఈ చిత్రంలో నటించేటప్పుడు నయనతార చాలా కోపంగా ఉండేవారని, ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుందా? అని అనిపించేదన్నారు. దుస్తుల విషయంలో కూడా త
సినిమా పరిశ్రమ అంటే రంగులమయం అంటారు కానీ ఇదో మాయాజాలం కూడా! ఇక్కడ రాణించడానికి అందం, ప్రతిభ, అంతకు మించి అదృష్టం ఉండాలంటారు. నయనతార కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు పడ్డారు. ఆమె ఈ స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కొందరు దర్శకులైతే నువ్వు నటిగా పనికి రావని ముఖం మీదే చెప్పిన సందర్భాలున్నాయి. ఎవరో ఎందుకు? నయనతారకు తమిళంలో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు హరినే ఈమె ఆ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదట.
ముక్కు మీద కోపం?
ఒక సందర్భంలో ఆయన నయనతార గురించి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన అయ్యా చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేశానని, అందులో ఆమె 12వ తరగతి చదివే యువతిగా నటించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించేటప్పుడు నయనతార చాలా కోపంగా ఉండేవారని, ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుందా? అని అనిపించేదన్నారు. దుస్తుల విషయంలో కూడా తనతో వాదించేవారని చెప్పారు. అయితే ఆ కోపంలో పని బాగా జరగాలనే భావం ఉండేదన్నారు.
ఈ స్థాయికి ఊహించలేదు
నయనతార మంచి నటిగా ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలుసుగానీ, మరీ ఈ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదన్నారు. నిజమే.. కేరళలోని ఓ గ్రామంలో పుట్టిన డయానా కురియన్ అనే అమ్మాయి ఇప్పుడు నయనతారగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలను దాటి బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగరేస్తున్నారంటే సాధారణ విషయం కాదు. అలాగే చిత్ర నిర్మాతగానూ ఇతరత్రా పలు వ్యాపారాలతోనూ బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్.
Comments
Please login to add a commentAdd a comment