
నయనతార లీడ్ రోల్‌లో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ ‘అంజలి విక్రమాదిత్య’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
తమిళంలో ఘన విజయం సాధించింది. నయనతార, అధర్వ, రాశీఖన్నాల నటన హైలైట్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశారు. ఇందులో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరవనున్నారు. అంజలి చేసే సాహసాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment