తమిళంలో నిన్ను కోరి | Atharvaa, Anupama movie a remake of Tolly film Ninnu Kori | Sakshi
Sakshi News home page

తమిళంలో నిన్ను కోరి

Jul 15 2019 3:36 AM | Updated on Jul 15 2019 3:36 AM

Atharvaa, Anupama movie a remake of Tolly film Ninnu Kori - Sakshi

మంచి ప్రేక్షకాదరణ దక్కిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్‌ కావడం సాధారణమే. ఆ జాబితాలోకి తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రం కూడా చేరిందట. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ ముఖ్య తారాగణంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం తెలుగులో మంచి హిట్‌ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్‌ అవుతోందని సమచారం. అధర్వ, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్య తారలుగా ఇటీవల కన్నన్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్‌ అని టాక్‌. మరి.. తెలుగులో ఆది పినిశెట్టి చేసిన పాత్రను తమిళంలోఎవరు? చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement