ninnukori
-
ప్రముఖ బుల్లితెర నటి అక్షత నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
తమిళంలో నిన్ను కోరి
మంచి ప్రేక్షకాదరణ దక్కిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సాధారణమే. ఆ జాబితాలోకి తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రం కూడా చేరిందట. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ముఖ్య తారాగణంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం తెలుగులో మంచి హిట్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోందని సమచారం. అధర్వ, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఇటీవల కన్నన్ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్ అని టాక్. మరి.. తెలుగులో ఆది పినిశెట్టి చేసిన పాత్రను తమిళంలోఎవరు? చేస్తారో చూడాలి. -
చిన్న బ్రేక్ తీసుకుంటా!
తమిళసినిమా: చిన్న బ్రేక్ తీసుకుంటున్నా అంటోంది నటి నివేదాథామస్. ఈ మలయాళ కుట్టి బాల తారగానే సినీరంగప్రవేశం చేసింది. అదేవిధంగా మాతృభాష మలయాళంతో పాటు, తమిళం, తెలుగులోనూ వరుసగా నటించేస్తోంది. తమిళంలో కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ మధ్య పాపనాశం చిత్రంలో కమలహాసన్ కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే తెలుగులో మాత్రం హిట్ చిత్రాల నాయకిగా ఎదుగుతోంది. నానీకి జంటగా జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన నివేదాథామస్, నిన్నుకోరి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం జూలియట్ అవర్ ఆఫ్ ఇడియట్ చిత్రంలో నటిస్తోంది. మరిన్ని అవకాశాలు అమ్మడి తలుపులు తడుతున్నా నో చెబుతోందట. కారణం తనకు చిన్న గ్యాప్ కావాలి అంటోందట. ఎవరైనా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలో వచ్చే అవకాశాలను వద్దంటారా? తాను అంటానంటోంది నివేదాథామస్. కారణం ఏమంటంటే ఈ మలయాళీ కుట్టి మనసు చదువు మీదకు మళ్లిందట. ఆర్కిటిక్ విద్యలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తానని అంత వరకూ తాను నటనలో చిన్న గ్యాప్ తీసుకుంటున్నానని నివేదాథామస్ అంటోంది. అంతా బాగానే ఉంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత ఈ అమ్మడికి తెలియదేమో. ఇంతకు ముందు లక్ష్మీమీనన్ కూడా నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె పరిస్థితి ఏలా మారిందో తెలుసు కథా! అవకాశాల కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా నివేదాథామస్ జాగ్రత్త పడితే ఆమెకే మంచిదంటున్నారు సినీ విజ్ఞులు. చూద్దాం నటిగా ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో. -
గుండె పిండేస్తున్న నాని 'అడిగా.. అడిగా..'
-
గుండె పిండేస్తున్న నాని 'అడిగా.. అడిగా..'
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు. 'నేను లోకల్' అంటూ హిట్ కొట్టిన నాని.. ‘నిన్నుకోరి’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని, నివేదా థామస్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో ‘నిన్నుకోరి’ మూవీ నుండి ‘అడిగా అడిగా’ సాంగ్‌ను ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని. చిత్ర ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఈ సాంగ్ మెలొడీ ప్రేమికుల మతి పోగొడుతోంది. పోస్టు చేసి 24 గంటలు గడవక ముందే ఐదున్నర లక్షల వ్యూస్ వచ్చాయి ఈ పాటకు. ఈ పాటకు గోపీ సుందర్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు.