
గుండె పిండేస్తున్న నాని 'అడిగా.. అడిగా..'
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు. 'నేను లోకల్' అంటూ హిట్ కొట్టిన నాని.. ‘నిన్నుకోరి’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని, నివేదా థామస్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో ‘నిన్నుకోరి’ మూవీ నుండి ‘అడిగా అడిగా’ సాంగ్‌ను ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని.
చిత్ర ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఈ సాంగ్ మెలొడీ ప్రేమికుల మతి పోగొడుతోంది. పోస్టు చేసి 24 గంటలు గడవక ముందే ఐదున్నర లక్షల వ్యూస్ వచ్చాయి ఈ పాటకు. ఈ పాటకు గోపీ సుందర్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు.