రాశీఖన్నా లక్కీచాన్స్‌ | Rashikhanna Romance With Jayam ravi | Sakshi
Sakshi News home page

రాశీఖన్నా లక్కీచాన్స్‌

Published Wed, Dec 6 2017 8:26 AM | Last Updated on Wed, Dec 6 2017 8:26 AM

Rashikhanna Romance With Jayam ravi - Sakshi

తమళసినిమా: రాశిని తన పేరులోనే ఇముడ్చుకున్న నటి రాశీఖన్నా. టాలీవుడ్‌లో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లో తన సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఆల్‌రెడీ బహుభాషా కథానాయకి అనిపించుకున్న రాశీ కోలీవుడ్‌లో ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది.  ఆ చిత్రం విడుదలకు ముందే మరో లక్కీచాన్స్‌ను కొట్టేసిందనేది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరున్న స్టార్‌ నటుడు జయంరవితో రొమాన్స్‌ చేసే అవకాశం రాశీఖన్నాను వరించింది. ఈయనతో జత కట్టిన హీరోయిన్లందరూ కోలీవుడ్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నది గమన్హారం.

జయంరవి ప్రస్తుతం శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకత్వంలో టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్‌ టిక్‌ టిక్‌ నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తదుపరి జయంరవి సుదర్‌.సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.ఈ చిత్రం 2018 ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్‌ దర్శకత్వంలో హోమ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. ఈ నెలలోనే చిత్ర షూటిం గ్‌ పారంభం కానుందని, ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. సీఎస్‌.శ్యామ్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement