Rashikanna
-
ప్రేక్షకులకు ఎలా దగ్గర కావాలో నాకు తెలుసు: రాశీ ఖన్నా
బహుభాషా కథానాయికల్లో నటి రాశీఖన్నా ఒకరు. అలాగే అందాలను విచ్చలవిడిగా తెరపై గుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడని నటి కూడా. అయితే పలు చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ స్టార్ అంతస్తు కోసం పోరాడుతూనే ఉంది. బహుశ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించడంతో ఏ భాషలోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు. రాశీఖన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నొడిగళ్. నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తరువాత జయంరవికి జంటగా నటించిన అడంగ మరు, ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రంఫలం, కార్తీకి జంటగా సర్ధార్ చిత్రాల్లో నటించింది. కాగా తాజాగా ఈమె కథానాయకిగా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కథానాయకిగా తమన్న నటించింది. ఈ చిత్రంలో అందాలను ఆరబోయడంతో రాశీఖన్నా తమన్నతో పోటీ పడిందనే చెప్పాలి. ఏదేమైనా అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ఈ సందర్భంగా నటి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలనని చెప్పింది. తాను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని చెప్పింది. తాజాగా అరణ్మణై 4 (తెలుగులో బాకు చిత్రంలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది. తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని, భాష అర్ధం అయితే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసు అని పేర్కొంది. కాగా తనకిప్పుడు తెలుగు, తమిళం భాషలను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పింది. కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది. తాను నటించిన కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా ఈ పయనం బాగుందనే అభిప్రాయాన్ని నటి రాశీఖన్నా వ్యక్తం చేసింది. -
లోకల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం
అందం, అభినయం కలిపి రాశిగా పోసి కనువిందు చేసిన అనుభూతిని అభిమానులు సొంతం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకుశుక్రవారం నగరానికి విచ్చేసిన సినీనటి రాశీఖన్నా తన హావభావాలతో అభిమానులను అలరించింది. బీచ్‌రోడ్డు(విశాఖతూర్పు): షూటింగ్ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడ లోకల్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తానని సినీ నటి రాశీఖన్నా అన్నారు. సిరిపురంలోని వాల్తేర్ క్లబ్ ఎదురుగా సామ్స్ గ్రిల్డ్ మల్టీ క్యుజిన్ రెస్టారెంట్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె అక్కడ ఫుడ్‌ను రుచి చూశారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ వెజ్..నాన్‌వెజ్ అనే తేడా లేకుండా అన్ని రకాల రుచులను ఇష్టపడతానని పేర్కొన్నారు. అందరికీ అనువుగా..విశాఖ ప్రజల మన్ననలు అందుకునేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారని, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందన్నారు. అమెరికన్, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ ఫుడ్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ రెస్టారెంట్ హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే కస్టమర్ల మన్ననలు పొందాయని, తాజాగా వైజాగ్‌లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం వైజాగ్‌లో తమిళ సినిమా షూటింగ్ జరుగుతోందని, అందులో తాను నటిస్తున్నట్టు చెప్పారు. విశాఖ ప్రజలు తన చిత్రాలను ఆదరిస్తూ..ప్రోత్సహిస్తున్నారన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు సత్య శ్రీరామ్ మాట్లాడుతూ శాకాహార, మాంసాహార ప్రియులకు పూర్తి స్థాయిలో విందును అందించే దిశగా తమ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. -
రాశీఖన్నా లక్కీచాన్స్
తమళసినిమా: రాశిని తన పేరులోనే ఇముడ్చుకున్న నటి రాశీఖన్నా. టాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లో తన సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఆల్రెడీ బహుభాషా కథానాయకి అనిపించుకున్న రాశీ కోలీవుడ్‌లో ఇమైకా నోడిగళ్ చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆ చిత్రం విడుదలకు ముందే మరో లక్కీచాన్స్‌ను కొట్టేసిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరున్న స్టార్ నటుడు జయంరవితో రొమాన్స్ చేసే అవకాశం రాశీఖన్నాను వరించింది. ఈయనతో జత కట్టిన హీరోయిన్లందరూ కోలీవుడ్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నది గమన్హారం. జయంరవి ప్రస్తుతం శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్ నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తదుపరి జయంరవి సుదర్.సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.ఈ చిత్రం 2018 ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్ దర్శకత్వంలో హోమ్ మూవీస్ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. ఈ నెలలోనే చిత్ర షూటిం గ్ పారంభం కానుందని, ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
వేలంటైన్ వీక్‌లో... తొలిప్రేమ
ఫిబ్రవరి... ప్రేమికులకు వెరీ స్పెషల్ మంత్! ఎందుకో స్పెషల్‌గా చెప్పాలా? ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే! 14కి ముందు వారం రోజులు... ఒక్కో రోజునూ ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేస్తారు. దటీజ్ వేలంటైన్స్ వీక్. సో, ప్రేమికులకు వెరీ వెరీ స్పెషల్ వీక్. అప్పుడే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ను ప్రేక్షకులందరికీ చూపిస్తారట! వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘తొలిప్రేమ’ టైటిల్ ఖరారు చేశారట. వచ్చే ఏడాది వేలంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే (ఫిబ్రవరి 9)న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇటీవల 40 రోజులు ఏకధాటిగా లండన్‌లో చేసిన షెడ్యూల్‌తో 70 శాతం సినిమా పూర్తయింది. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తమన్ సంగీతం, జార్జ్ సి. విలియమన్స్ ఛాయాగ్రహణం చిత్రానికి పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
రాంగ్ స్టెప్!
వెస్ట్రన్ మాస్ డ్యాన్స్‌తో మ్యూజిక్ క్లాస్ చాలా జోరుగా సాగుతోంది. సడన్‌గా ఓ రాంగ్ స్టెప్ పడింది. అంతే...హీరోయిన్ రాశీ ఖన్నా చూపు అటు పడింది. రాంగ్ స్టెప్‌ను కరెక్ట్ చేశారు. ‘ఇలా చేయాలి’ అని చెప్పడం కాదు.. స్టెప్ వేసి, చూపించారు. ఇలా రాంగ్ స్టెప్స్‌ను కరెక్ట్ చేస్తూ రైట్ స్టెప్స్ నేర్పిస్తున్నారామె. రాశీ ఖన్నా ఏదైనా మ్యూజిక్ స్కూల్లో డ్యాన్స్ టీచర్‌గా చేరారేమో అనుకుంటున్నారా? చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి అంత తీరిక ఏది? మరి... రాంగ్ స్టెప్స్‌ని కరెక్ట్ చేసింది ఎక్కడ? అంటే ‘టచ్ చేసి చూడు’ సినిమా లొకేషన్లో. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ రోల్ చేస్తున్నారు. అసలు విషయం అదన్న మాట. -
లక్ష్యసాధన కోసం...
లక్ష్యం సాధించాలంటే పట్టుదల ఉండాలి. లక్ష్యసాధన కోసం పోరాడాలి. పోరాటంలో అలసిపోకుండా ఉండాలంటే లక్ష్యానికి ఊపిరి ఊదాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అతను అదే చేశాడు? ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? దాన్నెలా సాధించాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్’. గోపీచంద్ హీరోగా, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా జగపతిబాబు ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని రూపొందించాం. గ్రాఫిక్స్‌కి ఎక్కువ టైమ్ పట్టింది. జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ ఎంత గొప్పగా ఉంటాయో సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. గోపీచంద్ నటన హైలైట్. యువన్‌శంకర్ రాజా స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు.