లక్ష్యసాధన కోసం... | Oxygen movie will be released on August 18th. | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధన కోసం...

Published Mon, Jul 10 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

లక్ష్యసాధన కోసం...

లక్ష్యసాధన కోసం...

లక్ష్యం సాధించాలంటే పట్టుదల ఉండాలి. లక్ష్యసాధన కోసం పోరాడాలి. పోరాటంలో అలసిపోకుండా ఉండాలంటే లక్ష్యానికి ఊపిరి ఊదాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అతను అదే చేశాడు? ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? దాన్నెలా సాధించాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్‌’.

గోపీచంద్‌ హీరోగా, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా జగపతిబాబు ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 18న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించాం. గ్రాఫిక్స్‌కి ఎక్కువ టైమ్‌ పట్టింది. జ్యోతికృష్ణ టేకింగ్‌ స్టాండర్డ్స్‌ ఎంత గొప్పగా ఉంటాయో సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. గోపీచంద్‌ నటన హైలైట్‌. యువన్‌శంకర్‌ రాజా స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement