సమంత అధర్వతో జోడీ కడుతుందా? | samantha paired with adarva ? | Sakshi
Sakshi News home page

సమంత అధర్వతో జోడీ కడుతుందా?

Published Sat, Jan 9 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

సమంత అధర్వతో జోడీ కడుతుందా?

సమంత అధర్వతో జోడీ కడుతుందా?

మరపురాని విజయాలు జీవితంలో మెలురాళ్లుగా నిలిచిపోతాయన్నది ఎంత సత్యమో తొలి చిత్రం అందులో నటించిన సహ నటుడు గానీ, నటి  గానీవారికి జీవితాంతం గుర్తుండి పోతారన్నది అంత నిజం. అలాగే నేటి కొత్త తారలు రేపటి క్రేజీ బ్యూటీలుగానూ మాపటికి మాజీ భామలుగానూ అవడం సహజం.
 
  ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం నటిగా సమంత స్థాయి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్, తెలుగు ద్విభాషల్లోనూ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ చెన్నై చందం నటిస్తున్నవన్నీ టాప్ హీరోల చిత్రాలే అన్నది గమనార్హం. అయితే సమంత నాయకిగా నటించిన తొలి చిత్రం బానాకాత్తాడి. ఇందులో కథానాయకుడు అధర్వ. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించిన ఆ చిత్రానికి బద్రి వెంకట్ దర్శకుడు. 2010లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడిందన్నది వాస్తవం.
 
  కాగా సమంత కెరీర్‌కు మాత్రం బానాకాత్తాడి బాగానే హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ భామ ఘన విజయాన్ని చవిచూసింది మాత్రం తెలుగు చిత్రం ఏమాయ చేసావే చిత్రంతోనే. ఏదేమైనా ప్రస్తుతం సమంత ప్రముఖ కథానాయకి అంతస్థును అధిష్టించిన నటి. ఐదేళ్లలోనే 25 చిత్రాలో నటించేశారు. అలాంటి నాయకి ఇప్పుడు తన తొలి చిత్ర కథానాయకుడితో నటిస్తారా?అన్నదే చిత్రపరిశ్రమలో ఆసక్తిగా మారిన అంశం.
 
  విషయం ఏమిటంటే అధర్వకు చిన్న నిరీక్షణ తరువాత ఈటీ చిత్రంతో మంచి విజయం వరించింది.దీంతో చాలా ఉత్సాహంగా ఉన్న ఈ యువ హీరో స్వంతంగా చిత్ర నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. కిక్కాస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అనే బ్యానర్‌ను కూడా నమోదు చేసుకున్నారు. దీనికి తన తొలి చిత్ర దర్శకుడు బద్రివెంకట్‌నే ఎంచుకున్నారు.
 
 అదే విధంగా తొలి చిత్ర నాయకినే నటింపజేయాలని ఆశిస్తున్నట్లు, అందుకు దర్శకుడు, నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టాప్ హీరోల చిత్రాలతో యమ బిజీగా ఉన్న సమంత తన తొలి చిత్ర కథానాయకుడితో నటించడానికి సుముఖత వ్యక్తం చేస్తారా?లేదా అన్నది ఆసక్తిగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement