
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను దర్శకుడు శివ శేషు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
జగపతి బాబును అనుకున్నాం..
దర్శకుడు కావాలన్నది నా కోరిక. కొంతకాలం బిజినెస్ చేశాను గానీ తిరిగి నేను ఇష్టపడే చిత్ర పరిశ్రమకే వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత భాగమతి దర్శకుడు అశోక్ గారి దగ్గర, సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ గారి దగ్గర పనిచేశాను. లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. కానీ ఎక్కడో సెట్ అవకపోవడంతో నరేష్ అగస్త్యను తీసుకున్నాం
సినిమాలో సందేశం
కలి కథ సిద్ధమయ్యాక ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు టైమ్ పట్టింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70 శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో అతి మంచితనంతో ఉన్న శివరామ్(ప్రిన్స్) సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి(నరేష్ అగస్త్య) వస్తాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్ లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం.
కలికి కల్కికి సంబంధం లేదు
ప్రియదర్శి బల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాగే మహేశ్ విట్టా, అయ్యప్ప పి శర్మ ఇద్దరూ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. కలి సినిమాలో వీఎఫ్ఎక్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ చేశాం. కలి సినిమాకు కల్కి మూవీకి సంబంధం లేదు. మన పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేశాను అని చెప్పారు.
చదవండి: నోటిదురుసు గురించి నువ్వే చెప్పాలి.. మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య
Comments
Please login to add a commentAdd a comment