ప్రపంచంలోనే బెస్ట్ వంటకాలు, స్వీట్ల జాబితాను విడుదల చేసి వరల్డ్ టేస్ట్ అట్లాస్ తాజాగా బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్‌లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఫ్రైడ్ చికెన్‌ని తయారుచేస్తారు. అయితే ఆ జాబితాలో మన భారతీయ వంటకం చికెన్65 టాప్ 10లో చోటు దక్కించుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ వంటకం మూడో స్థానంలో నిలిచింది. దీన్ని అల్లం, నిమ్మకాయ, ఎర్రమిరపకాయల కారం, మసాలా దినుసులతో మెరినేట్ చేసి.. డీప్ ఫ్రై చేస్తారు. భారత్‌లో ఈ రెసిపీ బాగా ఫేమస్.
ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటకం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ చికెన్ 65 మూలం తమిళనాడుగా చెబుతుంటారు. అయితే చికెన్ 65 ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం తొలిసారి కాదు. గతేడాది ఆగస్టు 2023లో ఇదే థీమ్‌పై టేస్ట్ అట్లాస్ జాబితాను విడుదల చేసినప్పుడు చికెన్65 పదో స్థానంలో నిలిచింది. కాగా, టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ప్రస్తుత జాబితాలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ (చికిన్) అగ్రస్థానంలో ఉండగా, జపాన్‌కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది.
గత ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన అయామ్ గోరెంగ్ ఇప్పుడు 5వ స్థానానికి పరిమితమయ్యింది. ఇవేగాక వీటితోపాటు ఈ జాబితాలో చైనీస్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ (జాజీజీ), తైవానీస్ పాప్‌కార్న్ చికెన్, ఇండోనేషియా అయామ్ పెనియెట్ తదితరాలు టాప్10లో చోటు దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment