కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్ అండ్ ట్రామెల్ గైడ్ ఫ్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్ ఎస్ప్రెసో అనేది డార్క్ రోస్ట్ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్‌లా ఉంటుంది.
కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్ టాప్ ఎస్ర్పెస్సో మేకర్‌లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్‌లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్ కాఫీ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ.
చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్‌లో సర్వ్ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్ ఉంటుంది. సర్వ్ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే..
1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)
2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం)
3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్)
5. కాపుచినో (ఇటలీ)
6. టర్కిష్ కాఫీ (టర్కీయే)
7. రిస్ట్రెట్టో (ఇటలీ)
8. ఫ్రాప్పే (గ్రీస్)
9. ఐస్కాఫీ (జర్మనీ)
10. వియత్నామీస్ ఐస్‌డ్ కాఫీ (వియత్నాం)
(చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!)
Comments
Please login to add a commentAdd a comment