
డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారిగా ఐఎఫ్‌ఎస్ అధికారి అశ్విని సత్తూరు రానున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆమె నియామకంపై కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని కేంద్ర పాస్‌పోర్ట్ కార్యాలయంలో జరిగిన ఫారిన్ సర్వీస్ పోస్టింగ్ (ఎఫ్‌ఎస్‌పీ) బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పా స్పెషల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఉమాపతి కూమార్తె అశ్విని. ఆమె విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అశ్విని.. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే 56వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. వారం రోజుల్లో అశ్విని బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.