బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు.
‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు.
దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు.
ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్‌నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment