ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన హీరోయిన్ | Amy jackson busy with star heros | Sakshi
Sakshi News home page

ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన హీరోయిన్

Published Sat, Sep 5 2015 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన హీరోయిన్

ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన హీరోయిన్

సౌత్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ మీద ఒక అపవాదు ఉంది. శంకర్ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన తారలకు తరువాత కెరీర్ కష్టాల్లో పడినట్టే అని ఫీల్ అవుతారు సినీ అభిమానులు. ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. 'అపరిచితుడు' సినిమా తరువాత సదా, 'శివాజీ' తరువాత శ్రియ, 'స్నేహితుడు'  అనంతరం ఇలియానా  అవకాశాలు లేక ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ఈ ఇమేజ్ ను బ్రేక్ చేస్తోంది ఓ లండన్ బ్యూటి.

శంకర్ రీసెంట్ సినిమా 'ఐ' లో హీరోయిన్ గా నటించిన అమీజాక్సన్, ఆ సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమీ కోలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టడానికి రెడీ అవుతోంది. అజిత్, ధనుష్, సూర్య, విశాల్ ఇలా ఫాంలో ఉన్న కోలీవుడ్ హీరోలందరూ అమీతో నటించడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంత మంది క్యూలో ఉండగానే తాజాగా శివకార్తికేయతో ఓ సినిమాకు డేట్స్ ఇచ్చేసింది ఈ భామ. ఈ జోరు చూస్తుంటే హీరోయిన్ల విషయంలో శంకర్ సినిమాల సెంటిమెంట్ బ్రేక్ అయినట్టే అంటున్నారు అభిమానులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement