నా కెరీర్‌లోనే భారీ చిత్రం ‘ఐ’ | ' i' my career big movie | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లోనే భారీ చిత్రం ‘ఐ’

Published Wed, Sep 17 2014 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా కెరీర్‌లోనే భారీ చిత్రం ‘ఐ’ - Sakshi

నా కెరీర్‌లోనే భారీ చిత్రం ‘ఐ’

 నా కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రం ‘ఐ’ అని అంటోంది లండన్ బ్యూటీ ఎమి జాక్సన్. కోలీవుడ్‌లో తొలి చిత్రం మదరాసు పట్టణం చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఏ చిత్రమూ ఆశించిన విజయం సాధించలేదు. బాలీవుడ్ రంగ ప్రవేశం నిరాశ పరిచింది. అయినా ఎమి జాక్సన్‌కు అవకాశాలు క్యూ కట్టడం విశేషం. అంతేకాకుండా శంకర్ లాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ ముద్దు గుమ్మకు అదృష్టమనే చెప్పాలి. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భారీ చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఆస్కార్ ఫిలింస్ సంస్థ నిర్మించింది.
 
 ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ‘ఐ’చిత్ర హీరోయిన్ ఎమిజాక్సన్ మనోగతం,ఆమె మాటల్లోనే.. ఐ చిత్రం నా కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా నిచిపోతుంది. దీనికి నేను రెండేళ్లు పని చేశాను. పనిచేసిన రోజులను చాలా విలువైనవిగా భావిస్తాను. ప్రతి క్షణాన్ని  ఎంజాయ్ చేశాను. ఐ చిత్రం వెనుక పి.సి శ్రీరామ్ వంటి ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు ఉండటం చాలా లక్కీ. ఆయన సృజనాత్మకత ప్రతి సన్నివేశంలోనూ వెల్లడవుతుంది.
 
  ఇక ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం వండర్‌ఫుల్, దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా వివరించేవారు. ఐ చిత్రం షూటింగ్ 25 శాతం చైనాలో నిర్వహించారు. చిత్ర హీరో విక్రమ్ అత్యుద్భుతంగా నటించారు. ఆయన మల్టిఫుల్ గెటప్ ఆశ్చర్యపరుస్తాయి. నేనిందులో మోడల్‌గా నటించాను. చిత్రకథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. రొమాంటిక్ కామెడీతో పాటు సస్పెన్స్‌తో కూడిన పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఐ అని సెలవిచ్చింది. ఐ చిత్రం తర్వాత ఈ అమ్మడి క్రేజ్ ఎంతగా పెరుగుతుందో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement