9న తెరపైకి ఐ | i movie release on 9th december | Sakshi
Sakshi News home page

9న తెరపైకి ఐ

Published Thu, Dec 18 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

9న తెరపైకి ఐ

9న తెరపైకి ఐ

 భారతీయ సినిమానే కాకుండా, ప్రపంచ సినిమా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఐ. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్, భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్‌ల కాంబినేషన్‌లో వైవిధ్యం కోసం తపించే విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడమే ఈ చిత్రానికి అంత క్రేజ్. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీత బానీలను అందించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన తర్వాత చిత్రంపై మరింత ఉత్సుకత రేకెత్తిస్తున్నది. విషయం ఏమిటంటే చిత్ర నిర్మాణం పూర్తి అయినా, ఇంకా తెరపైకి రాక పోవడంతో చిత్రంపై మరింత చర్చ జరుగుతోంది. ఐ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల అవుతుందని ప్రచారం సాగింది.
 
 అయితే, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికాక పోవడంతో చిత్రం విడుదలను రెండు మూడు సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ వెల్లడించింది. సంక్రాంతి బరిలో ఇప్పటికే అజిత్ నటించిన ఎన్నై అరిందాల్, విశాల్ నటించి ఆంబళ చిత్రాలతోపాటుగా తాజాగా కార్తీ నటించి కొంభన్ చిత్రం కూడా రెడీ అవుతుండడంతో ఐ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఐ చిత్రం జనవరి 9న కచ్చితంగా వచ్చి తీరుతుందని ఆ చిత్ర ఛాయా గ్రహకుడు పీసీ శ్రీరాం తన ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement