అంతకు మించి...ఐ లవ్ యు | I love you beyond ... | Sakshi
Sakshi News home page

అంతకు మించి...ఐ లవ్ యు

Published Sun, Feb 8 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

అంతకు మించి...ఐ లవ్ యు

అంతకు మించి...ఐ లవ్ యు

సినోయెమ్
 
 సౌందర్యంతో కాలుస్తావో
 మోహపు మంట ఎగదోస్తావో
 విరహపు చింత రగిలిస్తావో
 అంతకు మించి
 ప్రేమించి బూడిదే చేస్తావో
 ప్రియురాలా! ఐ లవ్ యు

 రంగుల కళల్ని కళ్లలో జల్లుతావో
 రసాత్మకమైన వాక్యపు దండకే గుచ్చుతావో
 పారవశ్యపు నాట్యభంగిమ కిందే నలిపేస్తావో
 రాగసాగర దీవిలో ఒంటరిగా వదిలిపెడతావో
 అంతకు మించి
 జీవించడమే అసలైన కళ అని
 కణకణానికీ ఇంజెక్ట్ చేస్తావో
 సృజనశీలా! ఐ అడ్మైర్ యు

 మరింత మాయ చేస్తావో
 మరో లోయలోకి మళ్లీ తోస్తావో
 అంతకు మించి
 కుట్రతో హృదయాన్ని పదవీచ్యుతుణ్ని చేసి
 లోపలి ప్రపంచానికి నువ్వే రాజువవుతావో మనసా! ఐ అబ్జర్వ్ యు

 జీవితపు కషాయాన్ని తాగిస్తావో
 నిర్జీవ క్షణాలముందు దోషిగా నిలబెడతావో
 నన్ను చూసి నేనే నవ్వుకోలేకపోయిన రోజుల్ని వెక్కిరిస్తావో
 అంతకు మించి
 అకారణ ఆనందాన్ని యావజ్జీవం విధిస్తావో
 తాత్వికుడా! ఐ ఇన్‌వైట్ యు

 అనంతరం ఆకాశానికే అప్పగిస్తావో
 దాని అవతలికే విసిరేస్తావో
 అంతకు మించి
 విశాల విశ్వంలో మానవుడి
 నూరేళ్ల అల్పాయుష్షుని గుర్తుచేసి
 హఠాత్తుగా కలవరపెడతావో
 మృత్యువా! ఐ రిమెంబర్ యు
 (‘అంతకు మించి’... శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’లోని అతి ముఖ్యమైన డైలాగ్.
 ఆ డైలాగ్ సృష్టికర్తకు ఈ యాంటీవైరస్ కవిత అంకితం.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement