ఐ చిత్ర యూనిట్‌కు షాక్ | vikram 'I' movie unit shock | Sakshi
Sakshi News home page

ఐ చిత్ర యూనిట్‌కు షాక్

Published Fri, Sep 5 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

vikram 'I'   movie unit shock

 ఐ చిత్ర యూనిట్‌కు షాక్‌తగిలింది. ఈ సంఘటన ఇటీవల జరిగింది. సియాన్ విక్రమ్ నోరు కుట్టుకుని, కడుపు మాడ్చుకుని ఒళ్లు తగ్గి మళ్లీ కడుపు నింపుకుని అందరూ అచ్చెరుచెందేలా దేహం పెంచుకుని ఇలా అహర్నిశలు శ్రమించి నటించిన చిత్రం ఐ. లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా సుమారు 180 కోట్ల వ్యయంతో నిర్మించిన చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ ఒక తపస్సులా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
 
 చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా శంకర్ తన చిత్రానికి సంబంధించిన విషయాలను నిర్మాణ దశలో అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికి ఈ చిత్ర కథేమిటో చిత్రానికి పనిచేసిన అతి కొద్దిమందికి మినహా ఎవరికీ తెలియదన్నది అతిశయోక్తి కాదు. ఐ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన ఒకటి, లేదా రెండు స్టిల్స్ మాత్రమే బయటకొచ్చాయంటే దర్శకుడు ఎంత కట్టడి చేస్తున్నారో అర్థమవుతుంది.
 
 అలాంటిది ఐ చిత్రం టీజర్ సోషల్ నెట్‌వర్స్ సైట్స్‌లో హల్‌చల్ చేయడం విశేషం. ఇది నిజంగా ఆ చిత్ర యూనిట్‌కు షాక్‌నిచ్చే సంఘటనే. చిత్ర యూనిట్ ఇటీవల చిత్ర ప్రచార చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు చూపించారు. మరి వాళ్లల్లో ఎవరు ఐ చిత్ర టీజర్‌ను ఎలా లీక్ చేసుంటారు? ఏమో? అయితే ఈ టీజర్ క్లియర్‌గా కాకుండా అవుట్ ఆఫ్ ఫోకస్‌లో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement