Ravi Chandran
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
గగన్‌యాన్ తరహాలో ‘సముద్రయాన్’
రేణిగుంట/ఏర్పేడు(తిరుపతి జిల్లా): గగన్‌యాన్ తరహాలో సముద్రయాన్‌కు భారత శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెన్ సెక్రెటరీ, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు. డీప్ ఓషన్ టెక్నాలజీ మిషన్‌లో భాగంగా సముద్ర వనరులు, సముద్రగర్భంలోని జీవ వైవిధ్యంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. తిరుపతి ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞానభారతి సంయుక్తంగా తిరుపతి ఐఐటీలో మంగళవారం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో రవిచంద్రన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..ముగ్గురు ఆక్వానాట్స్తో ప్రయాణం చేయడానికి అనువైన జలాంతర్గామిని ఈ పరిశోధనకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ వంటి సముద్ర ఆర్థిక వనరులను సమగ్రంగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ..సమాజ స్థితి గతులను సైన్స్ మారుస్తుందన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బికే దాస్ డీఆర్డీవో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ..జ్ఞానం లేని విద్య, మానవత్వం లేని మనిషి వ్యర్థమన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఎస్టీఎఫ్(తిరుపతి) ప్రెసిడెంట్ నారాయణరావు, విజ్ఞాన భారతి ప్రతినిధి త్రిస్టా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్
-
గుండెపోటుతో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
ఘట్కేసర్లోని కల్కి ప్రేవేటు ఆసుపత్రిలో రవి చంద్రన్(30) అనే యువ ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందాడు. ఘట్కేసర్ మండలం పోచారం వద్ద నున్న ఇన్ఫోసిస్ కంపెనీలో రవికొంతకాలంగా పనిచేస్తున్నాడు. బుధవారం పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. రవి చంద్రన్ స్వస్థలం తమిళనాడులోని వేలూరు. -
అయ్యో పాపం.. విక్రమ్‌కి ఏమైంది?
అయ్యో పాపం.. విక్రమ్‌కి ఏమైంది?’’.. ఈ ఫొటో చూసినవాళ్లందరూ ఇలానే అనుకుంటున్నారు. విక్రమ్‌కి ఆరోగ్యం బాగాలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఈ ఫొటో నిజమైనదో, మార్ఫింగ్ చిత్రమో తెలీదు కానీ, తాజాగా నెట్లో విపరీతంగా ప్రచారంలో ఉంది. విక్రమ్ ఇలా తయారవడానికి కారణం ‘ఐ’ చిత్రం. శంకర్ దర్శకత్వంలో ‘ఆస్కార్’ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తారు. అందులో బక్కపలచని అవతారం ఒకటి. ఆ గెటప్ కోసమే విక్రమ్ సన్నబడిపోయారట. ఎముకల గూడును తలపించే ఈ దేహం కోసం షూటింగ్ సమయంలో ఆహారపరంగా, వ్యాయామాల పరంగా శరీరాన్ని చాలా కష్టపెట్టుకున్నారట. పాత్ర కోసం విక్రమ్ గతంలో కూడా పలు రిస్కులు తీసుకున్నారు. ‘ఐ’ కోసం తీసుకున్న ఈ రిస్క్ వాటన్నింటికీ పరాకాష్ఠ అని తమిళ సినీ జనం చెవులు కొరుక్కుం టున్నారు. ఫొటో నిజానిజాల మాటెలా ఉన్నా శరీరం మీద ప్రయోగాలు చేయడం శ్రేయస్కరం కాదనీ, విక్రమ్ తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సన్నిహితులు అంటున్నారు. -
ఐ చిత్ర యూనిట్‌కు షాక్
ఐ చిత్ర యూనిట్‌కు షాక్తగిలింది. ఈ సంఘటన ఇటీవల జరిగింది. సియాన్ విక్రమ్ నోరు కుట్టుకుని, కడుపు మాడ్చుకుని ఒళ్లు తగ్గి మళ్లీ కడుపు నింపుకుని అందరూ అచ్చెరుచెందేలా దేహం పెంచుకుని ఇలా అహర్నిశలు శ్రమించి నటించిన చిత్రం ఐ. లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా సుమారు 180 కోట్ల వ్యయంతో నిర్మించిన చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ ఒక తపస్సులా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా శంకర్ తన చిత్రానికి సంబంధించిన విషయాలను నిర్మాణ దశలో అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికి ఈ చిత్ర కథేమిటో చిత్రానికి పనిచేసిన అతి కొద్దిమందికి మినహా ఎవరికీ తెలియదన్నది అతిశయోక్తి కాదు. ఐ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన ఒకటి, లేదా రెండు స్టిల్స్ మాత్రమే బయటకొచ్చాయంటే దర్శకుడు ఎంత కట్టడి చేస్తున్నారో అర్థమవుతుంది. అలాంటిది ఐ చిత్రం టీజర్ సోషల్ నెట్వర్స్ సైట్స్‌లో హల్చల్ చేయడం విశేషం. ఇది నిజంగా ఆ చిత్ర యూనిట్‌కు షాక్‌నిచ్చే సంఘటనే. చిత్ర యూనిట్ ఇటీవల చిత్ర ప్రచార చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు చూపించారు. మరి వాళ్లల్లో ఎవరు ఐ చిత్ర టీజర్‌ను ఎలా లీక్ చేసుంటారు? ఏమో? అయితే ఈ టీజర్ క్లియర్‌గా కాకుండా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.