అయ్యో పాపం.. విక్రమ్‌కి ఏమైంది?
అయ్యో పాపం.. విక్రమ్‌కి ఏమైంది?’’.. ఈ ఫొటో చూసినవాళ్లందరూ ఇలానే అనుకుంటున్నారు. విక్రమ్‌కి ఆరోగ్యం బాగాలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఈ ఫొటో నిజమైనదో, మార్ఫింగ్ చిత్రమో తెలీదు కానీ, తాజాగా నెట్‌లో విపరీతంగా ప్రచారంలో ఉంది. విక్రమ్ ఇలా తయారవడానికి కారణం ‘ఐ’ చిత్రం. శంకర్ దర్శకత్వంలో ‘ఆస్కార్’ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తారు. అందులో బక్కపలచని అవతారం ఒకటి. ఆ గెటప్ కోసమే విక్రమ్ సన్నబడిపోయారట.
ఎముకల గూడును తలపించే ఈ దేహం కోసం షూటింగ్ సమయంలో ఆహారపరంగా, వ్యాయామాల పరంగా శరీరాన్ని చాలా కష్టపెట్టుకున్నారట. పాత్ర కోసం విక్రమ్ గతంలో కూడా పలు రిస్కులు తీసుకున్నారు. ‘ఐ’ కోసం తీసుకున్న ఈ రిస్క్ వాటన్నింటికీ పరాకాష్ఠ అని తమిళ సినీ జనం చెవులు కొరుక్కుం టున్నారు. ఫొటో నిజానిజాల మాటెలా ఉన్నా శరీరం మీద ప్రయోగాలు చేయడం శ్రేయస్కరం కాదనీ, విక్రమ్ తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సన్నిహితులు అంటున్నారు.