సంచలనం రేపుతున్న 'ఐ' టీజర్!
సంచలన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు ఓ సంచనల విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఆదే కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన 'ఐ' చిత్రం సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. షూటింగ్ సమయంలోనే ఎన్నో విశేషాలకు తెరతీసిన 'ఐ' చిత్రం మరో ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ఇంటర్నెట్ లో హల్ చల్ రేపుతోంది. 'ఐ' టీజర్ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం మరిన్ని సంచలనాలకు వేదిక కావడంలో ఇలాంటి సందేహం అక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.