
ఐ ఆడియో ఆవిష్కరణకు అతిరథులు'
ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణకు సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొననుండటం విశేషం. బ్రహ్మాండ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్, స్టార్ దర్శకుడు శంకర్, సియాన్ విక్రమ్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం ఐ. 180 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది.
ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ స్వర పరచిన ఈ చిత్ర ఆడియో (తమిళం)ఆవిష్కరణ కార్యకమాన్ని వచ్చే నెల చెన్నైలో నిర్వహించను న్నారు. దీనికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ హాజరు కానున్నారు. హైదరాబాదులో నిర్వహించనున్న తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. తమిళ చిత్ర ఆడియోను ఆర్నాల్డ్ ఆవిష్కరించగా తొలి ప్రతిని తమిళ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్ అందుకోనున్నారన్నది తాజా సమాచారం.