హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.
‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment