ఇండియన్–2 చిత్ర షూటింగ్ ఆలస్యానికి తాను బాధ్యున్ని కానని.. అందుకు కారణం ఆ చిత్ర నిర్మాణ సంస్థే అని దర్శకుడు శంకర్ కోర్టులో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్–2. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు.
కాగా దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో శంకర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. శంకర్ తన వివరణ ఇస్తూ.. ఇండియన్–2 చిత్రాన్ని తొలుత దిల్‌రాజు నిర్మించడా నికి సిద్ధమయ్యారని.. అయితే తామే నిర్మిస్తామని అడి గి మరీ లైకా సంస్థ తీసుకుందన్నారు. దీంతో 2018 మేలో మొదలెట్టినట్లు తెలిపారు.
చిత్రానికి రూ.270 కోట్లు బడ్జెట్ అవుతుందని, చివరికి రూ.250 కోట్లకు కుదించినా షూటింగ్‌ను ప్రారంభించడానికి జాప్యం చేశారన్నారు. ఆ తరువాత నటుడు కమలహాసన్‌కు మేకప్ అలర్జీ, చిత్రీకరణ సమయంలో క్రేన్ విపత్తు, లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు. సాంకేతిక నిపుణులకు నగదు చెల్లించకపోవడంతో వారు ఇతర చిత్రాలలో నటించడానికి వెళ్లిపోయారన్నారు.
చదవండి:
అమ్మానాన్నలని డబ్బులు అడగలేను: శృతిహాసన్
గజిని చిత్ర నిర్మాత కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment