అప్పుడే ఇండియన్‌ 2 గురించి శంకర్‌తో మాట్లాడా!: కమల్‌హాసన్‌ | Kamal Haasan about indian 2 movie | Sakshi
Sakshi News home page

అప్పుడే ఇండియన్‌ 2 గురించి శంకర్‌తో మాట్లాడా!: కమల్‌హాసన్‌

Published Mon, Jun 3 2024 5:43 AM | Last Updated on Mon, Jun 3 2024 5:43 AM

Kamal Haasan about indian 2 movie

అనిరుద్, గుల్షన్, సుభాస్కరన్, జ్ఞానాంబిగై, కమల్‌హాసన్, శంకర్‌

‘‘ఇరవైఎనిమిదేళ్ల క్రితం నేను శివాజీ గణేశన్‌ గారితో ఓ సినిమా చేయాల్సింది. అదే సమయంలో ‘ఇండియన్‌’ కథతో దర్శకుడు శంకర్‌ వచ్చారు. ఈ రెండు చిత్రాల కథలు దగ్గర దగ్గరగా ఉన్నాయని శివాజీగారితో చెప్పాను. ‘శంకర్‌గారితోనే సినిమా చేయండి. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. శివాజీగారు అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతో శంకర్‌గారితో ‘ఇండియన్‌ ’ సినిమా చేశాను. నిర్మాత ఏఎం రత్నంగారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ సమయంలోనే ‘ఇండియన్‌’కు సీక్వెల్‌ గురించి శంకర్‌గారితో మాట్లాడాను. కథ రెడీగా లేదన్నారు.

28 ఏళ్ల తర్వాత ‘ఇండియన్‌ 2’ చేశాం. అనిరుధ్‌ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు కమల్‌హాసన్‌. హీరో కమల్‌హాసన్‌– దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఇండియన్‌ 2’. కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’కు సీక్వెల్స్‌గా ‘ఇండియన్‌ 2’, ‘ఇండియన్‌ 3’ చిత్రాలు రూపొందాయి. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్‌ నిర్మించిన ‘ఇండియన్‌ 2’ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్‌ హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, సీడెడ్‌ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో శంకర్‌ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్‌ వంటి నటులు ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ‘ఇండియన్‌ 2’, ‘ఇండియన్‌ 3’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

 ‘‘ఇండియన్‌ 2’ పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఇండియన్‌’ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌గారు గొప్ప సంగీతం ఇచ్చారు. ‘ఇండియన్‌ 2’కి నేను సంగీతం ఇచ్చాను. శంకర్‌గారు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు అనిరు«ద్‌ రవిచందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement