‘‘యాభై రెండేళ్ల క్రితం నేను హైదరాబాద్‌కు ఓ సాంకేతిక నిపుణుడిలా వచ్చాను. నటుడిగా మూడుతరాలుగా నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంతకాలం నన్ను ప్రేక్షకులు స్టార్‌డమ్‌లో ఉంచారు. ఇక నాకు ఏదైనా లక్ష్యం ఉందా? అంటే బాలచందర్‌గారిలా చాలామందిని చిత్ర పరిశ్రమకు తీసుకురావాలి. నాలాంటి నటులను తయారు చేయాలి. అలా ప్రేక్షకుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను’’ అని కమల్‌హాసన్ అన్నారు.
శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, బ్రహ్మానందం, సముద్ర ఖని, బాబీసింహా, గుల్షన్ గ్రోవర్ ఇతర రోల్స్‌లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ‘భారతీయుడు 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీలక్ష్మి మూవీస్ దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్‌హాసన్ మాట్లాడుతూ–‘‘కమ్‌బ్యాక్ ఇండియన్ ’ అంటే ఇండియన్ తాత గురించి కాదు.. మనవడు రావాలి.. వస్తాడు.
‘ఇండియన్ 2’ను హిట్ చేయండి.. త్వరగా ‘ఇండియన్ 3’ చూస్తారు. ‘భారతీయుడు’ నిర్మించిన ఏఎయం రత్నంగారికి ధన్యవాదాలు. శంకర్‌గారిలాంటి విజన్ ఉన్న దర్శకులు ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయి సినిమా చేశారు. ఇందులో తెలుగు సినిమాకు పెద్ద భాగం ఉంది. కళాకారులు భాష సరిహద్దులను చేరిపేశారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్, బాలచందర్, శంకర్‌గార్ల వంటి దర్శకులు, ఆర్టిస్టులు ఉన్నారు’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ–‘‘లంచగొండి వార్తలను చదివిన ప్రతిసారి ‘భారతీయుడు’ మళ్లీ రావాలని నాకు అనిపించేది. కానీ స్టోరీ కుదరలేదు.
‘2.ఓ’ తర్వాత కమల్‌గారికి ‘భారతీయుడు’ సీక్వెల్ కథ చె΄్పాను. నేను రాసిన ఓ సన్నివేశాన్ని తన నటనతో పదింతలు గొప్పగా ఉండేలా చేస్తారు కమల్‌గారు. బ్రహ్మానందంగారికి నేను అభిమానిని. ‘ఇండియన్ 2, గేమ్‌చేంజర్’లో ఆయన అతిథి పాత్ర చేశారు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సునీల్, తిరుపతి ప్రసాద్‌గార్లకు థ్యాంక్స్. రామ్‌చరణ్‌తో ‘గేమ్‌చేంజర్’ చేస్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేస్తాం’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం నాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు’’ అన్నారు ఏస్‌జే సూర్య. ‘‘నా అభిమాన నటుడు కమల్‌గారితో నటించాలన్న నా కల నిజమైంది.
కమల్‌హాసన్ గారికి నేను ఎప్పటికీ విద్యార్థినే. యువతరానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? అన్నది ‘భారతీయుడు 2’లో ఉంటుంది’’ అన్నారు సిద్ధార్థ్. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ‘‘ఈ విశ్వంలో కమల్‌గారిలాంటి నటుడు మరొకరు లేరు. ఆయనతో నటించానని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. ఈ వేడుకలో నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్, నటులు బాబీసింహా, సముద్రఖని, గీత రచయితలు సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment