మరింత ఆలస్యంగా ‘ఇండియన్‌ 2’..? | Confusion Over Release Date of Kamal Haasan Indian 2 | Sakshi
Sakshi News home page

మరింత ఆలస్యంగా ‘ఇండియన్‌ 2’..?

Published Sun, May 5 2024 1:15 AM | Last Updated on Sun, May 5 2024 10:36 AM

Confusion Over Release Date of Kamal Haasan Indian 2

భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌తోనే ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్‌ 2’, ‘ఇండియన్‌ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్‌. ‘ఇండియన్‌ 2’ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఇటీవల ప్రకటించింది.

అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటిస్తారనే టాక్‌ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్‌ రవిచందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement