శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్‌ని బట్టి తెలుస్తుంది.
ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్‌లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)
ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్‌కి ప్లస్ అవుతుంది.
(చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)
ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment