సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే..దాని ఎఫెక్ట్ నెక్ట్స్ ఫిల్మ్‌పై కచ్చితంగా ఉంటుంది. సదరు డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్ చేసి ఉంటే.. సదరు హీరో అభిమానులకు టెన్షన్ తప్పదు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్ పట్టుకుంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూసి వారు భయపడిపోతున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో టెన్షన్ మొదలైంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కావడంతో రీలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్‌పై ఒత్తిడి తెచ్చారు. అప్‌డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడయా వేదికగా శంకర్‌కి, నిర్మాత దిల్‌రాజ్‌కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్.. ఇప్పట్లో రిలీజ్ వద్దంటూ వేడుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శంకర్‌పై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. భారతీయుడు 2 చిత్రాన్ని నాసిరకంగా తెరకెక్కించారంటూ శంకర్‌ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా.. ట్రోలింగ్ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్ డేట్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి అని చిత్ర యూనిట్‌కి మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment