విజయవాడకు భారతీయుడు | Kamal Haasan Indian 2 Movie Next Shooting Schedule In Vijayawada, Filming Of Key Scenes Was Planned - Sakshi
Sakshi News home page

Indian 2 Shooting In Vijayawada: విజయవాడకు భారతీయుడు

Published Thu, Nov 9 2023 4:04 AM

Indian 2 next shooting in Vijayawada - Sakshi

హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే రూపొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్‌ కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేశారని తెలిసింది.

దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్‌లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్‌ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్‌ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్‌ 2’కు కొనసాగింపుగా ΄్లాన్‌ చేసిన ‘ఇండియన్‌ 3’ షూటింగ్‌ను కూడా ఆల్రెడీ శంకర్‌ ఆరంభించారని,  ఇందుకు కమల్‌ అదనంగా 40 రోజుల కాల్షీట్స్‌ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్‌ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ‘ఇండియన్‌ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement