‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment