
సీనియర్ నటీమణుల నుంచి వర్తమాన నటీమణుల వరకు ఇప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. దానిని వారు ఒక ప్రమోషన్ సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. తారలు తమ అనుభవాలను, అభిప్రాయాలను, వారి ఆకర్షణీయమైన ఫొటోలను, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు అతీతం కాదు. ఆది నుంచి గ్లామర్‌ని నమ్ముకున్న ఈ ఉత్తరాది భామ ఆ తరహా పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు!
అయితే ఈ మధ్య అమ్మడికి దక్షిణాదిలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి సారిస్తోంది. అలాంటి క్రమంలో తాజాగా ఇండియన్–2 చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్‌లు ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. అయితే కొన్ని సమస్యలు కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిపోయిన సంగతి తెలిసిందే.
చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి
ఈ సినిమా షూటింగ్ సంవత్సరాల తరబడి వాయిదా పడటం, ఇందులో నటించిన వివేక్, మరో మలయాళ నటుడు మరణించడం, నటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. దీంతో చాలా కాలం పాటు షూటింగ్ ఆగిపోగా ఇటీవల మళ్లీ మొదలైంది. ఇది కాస్తా కాజల్, రకుల్‌కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరు దక్షిణాది సినీ తెరకు ఆల్‌మోస్ట్ సైడ్ అయిపోతున్న తరుణంలో ఇండియన్–2 చిత్రం షటింగ్ మళ్లీ పట్టాలెక్కడంతో వారు ఇందులో నటించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్ర షూటింగ్‌లో సెట్ అడుగుపెట్టిన రకుల్ కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment