
తమిళ సినిమా: నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు అర్జెంటుగా ఒక హిట్ అవసరం. ఎందుకంటే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇంతకుముందు తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల చాలా వెనుకబడిందని చెప్పాలి. ఇక తమిళంలో ధీరన్ అధికారం, ఒండ్రు వంటి ఒకటి రెండు మినహా ఈమెకు సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కలిసి శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2, శివకార్తీకేయన్ సరసన అయలాన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి.
చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇండియన్ 2 చిత్రంలో నటించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. నటుడు కమల్ హాసన్ ఒక విశ్వవిద్యాలయం అని పేర్కొంది. ఆయనతో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపింది. వందేళ్ల సినిమాలో 60 ఏళ్లుగా ఈయన ఉన్నారని, ఇది పెద్ద రికార్డు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసిన నటులు వారని, మనం చేసే పనిలో శ్రద్ధ పెట్టాలని, అప్పుడే వాళ్ల మాదిరి మనమూ సాధించగలమని తెలియజేశారన్నారు. ఇకపోతే ఇండియన్ 2, అయలాన్ చిత్రాల్లో తనకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణే మిగిలిందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment