
'నగ్నదృశ్యాలు ఇబ్బందికరం'
లండన్: నగ్నంగా నటించడం ఇబ్బందికరమేనని హాలివుడ్ యాక్షన్ స్టార్ ఆర్నార్డ్ ష్వార్జ్ నెగ్గర్ అంగీకరించాడు. తాజా చిత్రం 'టెర్మినేటర్ జెనిసిస్' కోసం అతడు దస్తులు త్యజించాడు. అయితే ఈ దృశ్యాల్లో నటించేందుకు ఇబ్బంది పడినా తమాషా ఉంటుందని 67 ఏళ్ల ష్వార్జ్ నెగ్గర్ పేర్కొన్నాడు.
'నగ్న దృశ్యాలు ఇబ్బందికరం. కానీ మా సినిమాలో ఈ సన్నివేశం తమాషాగా ఉంటుంది. సరదా సంవాదం, మాటలతో హాస్యభరితంగా ఈ సీన్ ఉంటుంద'ని ష్వార్జ్ నెగ్గర్ తెలిపాడు.