రోడ్డు మీద పడుకున్న సూపర్ స్టార్ | Arnold schwarzenegger sleeps under his statue | Sakshi
Sakshi News home page

రోడ్డు మీద పడుకున్న సూపర్ స్టార్

Published Tue, Aug 22 2017 11:14 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM

Arnold schwarzenegger sleeps under his statue

హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్కార్జ్ నెగ్గర్.. ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా తన విగ్రహం ముందు తానే రోడ్డు మీద పడుకున్నాడు. అంతటి సూపర్ స్టార్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? ఆ విషయంలోకే వస్తున్నా. కాలిఫోర్నియాకు ఆర్నాల్డ్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో ఓహియోలోని కొలంబస్ ఏరియాలో ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ నిర్వాహకులు కూడా అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం ఏర్పాటు చేయటంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటలకు వచ్చినా.. ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని మాట ఇచ్చారు.

అయితే ఇటీవల ఆ హోటల్ కు వెళ్లిన ఆర్నాల్డ్ వింత అనుభవం ఎదురైంది. ఓపెనింగ్ సమయంలో తనకు ప్రత్యేకంగా రూం కేటాయిస్తామని చెప్పిన వ్యక్తులే రూమ్స్ ఖాళీ లేవని చెప్పటంతో ఈ సూపర్ స్టార్ షాక్ తిన్నాడు. దీంతో నిరసన ఇలా రోడ్డు మీద పడుకొని తన నిరసన వ్యక్తం చేశాడు. తన ఫేవరెట్ స్టార్ ఇలా వీదుల్లో పడుకొని కనిపించటంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ఇదంతా కేవలం హాస్యం కోసమే చేశానని ఆర్నాల్డ్‌ ఓ పోస్ట్‌లో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement