
మరో హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫైర్ ట్విస్టర్ పేరుతో రూపొందిన హాలీవుడ్ చిత్రాన్ని అగ్ని అరక్కన్ పేరుతో రూపొందించిన చిత్రాన్ని మరుదమలై ఫిలిమ్స్ సంస్థ అధినేత రేస్‌కోర్స్ రఘునాథ్ తమిళంలోకి అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ఈయనే సంభాషణ రాయడం విశేషం. ఈయన ఇంతకుముందు పలు తమిళ చిత్రాలను విడుదల చేశారన్నది గమనార్హం.
(ఇది చదవండి: రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)
ఈ అగ్నిఅరక్కన్ చిత్రం గురించి నిర్మాత రేస్‌కోర్స్ రఘునాథ్ తెలుపుతూ పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎంత ప్రమాదకరమైందో చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ హాలీవుడ్ చిత్రాన్ని అనుమతులతో పలు చేర్పులు మార్పులు చేసి తమిళ కోసం సరికొత్తగా రూపొందించినట్లు చెప్పారు. చిత్రం ఆబాల గోపాలాన్ని అలరిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అగ్నిఅరక్కన్ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తర్వాత తమ సంస్థ నుంచి వరుసగా చిత్రాలు వస్తాయని నిర్మాత తెలిపారు.
(ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్)
Comments
Please login to add a commentAdd a comment