కామెడీ చేస్తోన్న కండల వీరుడు | Arnold Schwarzenegger to Star in Assassin Comedy | Sakshi
Sakshi News home page

కామెడీ చేస్తోన్న కండల వీరుడు

Published Sat, May 7 2016 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

కామెడీ చేస్తోన్న కండల వీరుడు

కామెడీ చేస్తోన్న కండల వీరుడు

టెర్మినేటర్, కేనన్, ఎక్స్పాండబుల్స్ చిత్రాలతో యాక్షన్ స్టార్గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్. ఇప్పటి వరకు తన బాడీకి తగ్గట్టుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ సీనియర్ హీరో ఇప్పుడు రూట్ మారుస్తున్నాడు. త్వరలో ఓ కామెడీ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్.

వై వియార్ కిల్లింగ్ గంథర్ పేరుతో తెరకెక్కుతున్న కామెడీ డ్రామాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు ఆర్నాల్డ్. ఈ సినిమాలో కిరాయి హంతుకుల ముఠా సభ్యుడిగా నటిస్తున్నాడు. తమకు ప్రత్యర్థి అయిన కరుడుగట్టిన హంతుకుడి గంథర్ను ఎలాగైన దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది ఆర్నాల్డ్ టీం. అయితే గంథర్ గ్యాంగ్ వీళ్ల ఎత్తులను ముందే పసిగట్టి ఆ ఎటాక్లను తిప్పికొడుతుంది. ఇలా టామ్ అండ్ జెర్రీల గేమ్లా జరిగే కథ కడుపుబ్బ నవ్వించనుంది. శాటర్ డే నైట్ సినిమాలో కీలక పాత్రలో నటించిన టారన్ కిల్లమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement