
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు.. ఆయన స్పృహలోకి వచ్చినట్లు వ్యక్తిగత సిబ్బంది మీడియాకు వెల్లడించారు.
కాగా, 70 ఏళ్ల ఆర్నాల్డ్‌కు గతంలో కూడా ఓసారి గుండెకు శస్త్ర చికిత్స అయ్యింది. 1997లో గుండెకు సంబంధించిన ఓ కృత్రిమ నాళాన్ని డాక్టర్లు అమర్చారు. అయితే అది సరిగ్గా పని చేయకపోవటంతో ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. గురువారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
ఐయామ్ బ్యాక్..
ఆపరేషన్ తర్వాత స్పృహలోకి వచ్చిన దిగ్గజ నటుడు ‘ఐ యామ్ బ్యాక్’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రతినిధి మీడియాకు విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కెనన్ ది బార్బేరియన్, ప్రేడేటర్, టెర్మినేటర్ తదితర చిత్రాలతో ఆర్నాల్డ్ సుపరిచితుడే. కాగా, గతంలో రెండు సార్లు ఆయన కాల్నిఫోరియాకు గవర్నర్‌గా కూడా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment