న్యూయార్క్: అమెరికాలో ఐదేళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతోంది. ఆ చిన్నారి పుట్టుకతోనే సగం గుండెతో జన్మించింది. ఆ చిట్టితల్లి పేరు కేథరీన్ లాంగే. ఆమె హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్‌తో జన్మించింది. ఈ గుండె లోపం కారణంగా ఆ చిన్నారికి గుండె ఎడమ భాగం అభివృద్ధి చెందదు. పాపం ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు నయమవుతుందేమోనన్న ఆశతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ అరుదైన వ్యాధిని ఆ చిన్నారి తల్లి 20 వారాల గర్భవతిగా ఉన్నప్పుడే గుర్తించారు వైద్యులు. ఈ విషయాన్ని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు కూడా. పైగా మెక్సికోలో ఈ అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స చేసే వైద్యులు కూడా లేరని కొలరాడోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఆ చిన్నారి పుట్టిన నాలుగు రోజునే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత నాలుగు నెలల వయసులో మరోకటి, రెండున్నర ఏళ్లలో మరొక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు.
అంతేకాదు ఆ చిన్నారికి దాదాపు 10 హార్ట్ కాథెటరైజేషన్లు(గుండె కొట్టుకునేలా చేసే డివైజ్‌లు) జరిగాయి. కేవలం గత 12 నెలల్లో 40 సార్లుకు పైగా రక్తం తీశారు. ఇప్పడూ 11వ హార్ట్ కాథెటరైజేషన్ ప్రక్రియకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి గుండె జబ్బుతో పాటు, లివర్ లీకేజ్‌తో బాధపడుతోంది. దీన్ని ప్రోటీన్ లాసింగ్ ఎంట్రోపతి అని పిలుస్తారు. ఐతే ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారి బతుకుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ వైద్యుల ప్రయత్నాలు విఫలమైతే ప్రత్యక్ష గుండె మార్పిడి చేయాల్సి ఉంటుందని అన్నారు.
(చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం.. మంటల్లో సైతం ఎగిరి..)
Comments
Please login to add a commentAdd a comment