10-year-old girl gets 'married' days before dying of leukemia - Sakshi
Sakshi News home page

చిన్నారి క్యాన్సర్‌ పెళ్లి కూతురు.. కథ వింటే కన్నీరాగదు!

Published Wed, Aug 9 2023 1:30 PM | Last Updated on Wed, Aug 9 2023 3:04 PM

Girl Suffering from Cancer said i Want to get Married Parents - Sakshi

క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలిక తాను చనిపోవడానికి ముందు తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఆ మాట వినగానే తల్లిదండ్రులకు దు:ఖం తన్నుకొచ్చింది. అయితే వారు కుమార్తె చివరి కోరికను నెరవేరుస్తూ ఆమెకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఘటన అమెరికాలోని నార్త్‌ కరొలినాలో జరిగింది.

న్యూయార్క్‌ పోస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం క్యాన్సర్‌ బాధిత బాలిక ఎమ్మా ఎడ్వర్డ్స్‌(11)కు డానియల్‌ మార్షల్‌ క్రిస్టోఫర్‌ ‘డీజే’ విలియమ్స్‌ జూనియర్‌తో వివాహం జరిగింది.  ఎమ్మా.. లుకేమియా తోనూ బాధితురాలు. పెళ్లయిన 12వ రోజు ఆ బాలిక మృతి చెందింది. 

ఎమ్మా తల్లిదండ్రులకు తమ కుమార్తె లిమ్ఫోల్బా స్టిక్‌ లుకేమియా బాధితురాలని గత 2022లో తెలిసింది. ఇది క్యాన్సర్‌ మాదిరిగానే రక్తాన్ని, ఎముకలను తీవ్రంగా ప్రభావితం  చేస్తుంది. ఈ వ్యాధి చిన్నారులకు సోకితే ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే తమ కుమార్తె క్యాన్సర్‌ను జయిస్తుందని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆశ అడియాశగానే మిలిగింది. వైద్య పరీక్షలో ఆమెకు క్యాన్సర్‌ ముదిరిపోయిందని, ఇక కొద్ది రోజుల మాత్రమే ఆమె బతికి ఉంటుందని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలిపారు. 

అదే సమయంలో ఆ చిన్నారి తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. తాను ‘డీజే’ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఎమ్మా తల్లి ‘డీజే’ తల్లిదండ్రులతో మాట్లాడి, వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి మాటలు మాట్లాడుకున్న రెండు రోజులకే ఎమ్మా, డీజేలకు ఘనంగా వివాహం జరిగింది. ఒక రోజు ఆ చిన్నారి ఉన్నట్టుంది స్పృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కాలి ఎముకలకు కూడా ‍క్యాన్సర్‌ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
ఇది కూడా చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్‌ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement